బీర్పూర్ మండలానికి మంజూరైన కస్తూరిబా బాలికల పాఠశాల మరియు బిసి బాలుర పాఠశాల తరలింపును అడ్డుకోవాలని వాటిని బీర్పూర్ లోనే కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ బీర్పూర్ మండల శాఖ తరపున సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీర్పూర్ బీజేపీ మండల ఇంచార్జి చిలుకమర్రి మదన్ మోహన్, మండల శాఖ బిజెపి అధ్యక్షులు మ్యాడ జనార్దన్, ప్రధాన కార్యదర్శి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు బూట్ల మార్కండేయ, నాయకులు మారుతి, నరేందర్, తిరుపతి, మల్లేష్, గంగాధర్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.