జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామ అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గం ఏర్పాటు గురువారం జరిగింది. 16 కుల సంఘాల సభ్యుల సమావేశం అనంతరం గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షునిగా ఎడపెల్లి గంగారెడ్డి, ఉపాధ్యక్షుడిగా గొడిసెల భుమేష్ గౌడ్, కోశాధికారిగా పుప్పాల నరేంధర్, రైటర్ గా రాపర్తి దేవేంధర్ లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా అంకతి రాజన్న, నూనే సంతోష్, తదితరులు పాల్గొన్నారు.