పెద్దపల్లి: రుడా ఏర్పాటుకు మంత్రి హామీ

56చూసినవారు
పెద్దపల్లి: రుడా ఏర్పాటుకు మంత్రి హామీ
పెద్దపల్లి జిల్లా కేంద్రంగా రామగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ- రుడా ఏర్పాటుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ కౌన్సిలర్లు నూగిల్ల మల్లయ్య, తాడూరి పుష్పకళ శ్రీమాన్, భూతగడ్డ సంపత్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి శ్రీధర్ బాబును కాంగ్రెస్ కౌన్సిలర్లు కలిసి రామగుండం పేరుతో వచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని వినతి పత్రం అందజేశారు.