ప్రజావాణిలో సమర్పించిన దరఖాస్తులను సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణు పేర్కొన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులు ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి పరిష్కారం దిశగా కృషి చేయాలని సూచించారు.