పెద్దపల్లి: ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి

85చూసినవారు
పెద్దపల్లి: ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వేణు సంబంధిత అధికారులకు తెలిపారు. సోమవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో ప్రజల దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం చూపించాలని సంబంధిత అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్