ఓదెల మండలం బాయమ్మపల్లి గ్రామంలో శుక్రవారం రూ. 5 లక్షలతో నిర్మాణం చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు శంకుస్థాపన చేశారు. అలాగే గ్రామంలో నూతన బోర్ వెల్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.