భారీ వర్షాలతో రామగుండం నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇండ్లలోకి నీరు చేరి ప్రజలంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ బుధవారం అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించి ప్రజలకు ధైర్యం చెప్పారు. స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన కనీస బాధ్యత మరిచి పట్టి పట్టనట్లు వ్యవహరించడం సిగ్గుచేటని ఆరోపించారు.