వేములవాడ: గోశాలను తనిఖీ చేసిన కలెక్టర్

61చూసినవారు
వేములవాడ: గోశాలను తనిఖీ చేసిన కలెక్టర్
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించిన (తిప్పాపురం) గోశాలను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం సాయంత్రం సందర్శించారు. గోశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోశాలలో ఉన్న ఆవులను చూసి ఆలయ అధికారులకు, ఈవో వినోద్ రెడ్డికి పలు సూచనలు చేశారు. గోవులకు అందించే మేత వివరాలను ఈవోను అడిగారు.

సంబంధిత పోస్ట్