ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. దక్షిణాఫ్రికాలోని జోహాన్స్‌బర్గ్ న్యాయస్థానం ఆవరణలో జరిగిన ఈ ఘటన చూస్తే స్పైడర్ మ్యాన్‌కు తాత ఉన్నాడేమోనని నెటిజన్లు అంటున్నారు. ఈ వీడియో ప్రకారం.. చోరీ కేసులో అరెస్ట్ అయి, కోర్టులో ఓ వ్యక్తి నిందితుడిగా విచారించబడుతున్నాడు. అయితే సదరు నిందితుడు ఆ కోర్టు నుంచి తప్పించుకున్న విధానం ఔరా అనిపించింది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.