17 ఏళ్ల రైతుల ఆకాంక్షను ప్రజా ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి సాకారం చేశారని స్థానిక రైతులు, ప్రజలు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో రిజర్వాయర్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ ప్రగతిపథంలో ముందడుగు పోతుందని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.