తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. తెలంగాణలో రుణమాఫీ, ఆరు గ్యారంటీలపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తున్నారు. రుణమాఫీ జరిగిందని, రైతులకు బోనస్ లభించిందని, గృహలక్ష్మి, మహాలక్ష్మి పథకాలు అమలయ్యాయని గవర్నర్ తెలిపారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నర్‌తో కావాలనే అబద్ధాలు చెప్పిస్తున్నారని నిరసన తెలిపారు.