400 మంది ఉద్యోగులు తొలగింపు.. కన్నీరు పెట్టుకున్న మహిళా కండక్టర్

64చూసినవారు
TG: టీజీఎస్ఆర్టీసీలో 400 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో తొలగించిన ఉద్యోగులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఓ మహిళా కండక్టర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. 'పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సజ్జనార్ మాపై పడ్డారు. చిన్న చిన్న పొరపాట్లకు మమ్మల్ని ఉద్యోగంలో నుంచి తొలగించి సజ్జనార్ మా కుటుంబాలను రోడ్డున పడేశారు' అంటూ మహిళా కండక్టర్ కన్నీరు పెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్