ప్రస్తుత పరిస్థితుల్లో హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్కే ముఖ్యమని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో అమరావతిలోని SRM యూనివర్సిటీలో "పాపులేషన్ డైనమిక్ డెవలప్‌మెంట్" సదస్సు జరిగింది. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.. "బ్రెయిన్ డ్రెయిన్ కు నేను వ్యతిరేకం. పని విధానంలో మార్పులు రావాలి. ఉత్పాదకత పెరిగేలా, ఫలితాలు ఉండేలా పని చేయాలి." అని అన్నారు.