ఓ వ్యక్తి స్కూటీ మీద వెళుతూ ఆకస్మాత్తుగా పక్కకు ఆపేసీ, కిందకి ఒరిగిపోయాడు.గమనించిన స్థానికులు అతని దగ్గరకు వెళ్లి కూర్చొబెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వాహనదారుడు పెట్టుకున్న హెల్మెట్‌లోని పాము బయటకు తొంగిచూడడంతో ఒక్కసారిగా భయపడిపోయారు. దీంతో ఆ పామును బంధించి, వాహనదారుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుండగా.. హెల్మెట్లు, బూట్లను ఓసారి చెక్ చేశాకే వెసుకోవాలని నెటిజన్‌లు కామెంట్లు చేస్తున్నారు.