మౌంటెయిన్ మామ్మల్స్ ఆఫ్ ది వరల్డ్ పుస్తకాన్ని ఎమ్. కె. రంజిత్ సిన్హా రచించారు. ఇండియాలో వన్యప్రాణుల సంరక్షణా విధానాలను రూపొందించడంలో ఈ రచయిత కీలకపాత్ర పోషించారు. ప్రపంచంలోని అత్యంత కఠినమైన, చేరుకోలేని పర్వతశ్రేణుల్లో నివసించే 62 జాతులు, 78 పెద్ద క్షీరదాల ఉపజాతులకు సంబంధించి ఈ పుస్తకం సమగ్ర వివరాలను అందిస్తోంది. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.