భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ భౌతికకాయం వద్ద కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, లోక్ సభలో విపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే, వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ఆమె ఆమె భర్త రాబర్ట్ వాద్రా సైతం నివాళులర్పించారు.