సహాయం చేయడంలో ముందుండే సినీ నటుడు సోనూసూద్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఖమ్మం జిల్లా చెన్నూరుకి చెందిన నిరుపేదలు కృష్ణ, బిందుప్రియల మూడేళ్ల కూతురికి ఉచితంగా ముంబైలో హార్ట్ ఆపరేషన్ చేయించారు. చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాలికకు చిన్నప్పటి నుంచే గుండె సమస్య ఉంది. ఆపరేషన్ కు రూ.6లక్షలపైగా ఖర్చవుతుందని స్థానిక వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ సోనూసూద్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆదుకున్నారు.