మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పథకమే ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం’. ఈ పథకం కింద ప్రభుత్వం 7.5 శాతం వడ్డీని అందిస్తోంది. అయితే రెండేళ్ల కాలానికి ఈ పథకంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అలాగే ఈ పథకం కింద గరిష్ట పెట్టుబడి మొత్తం రూ.2 లక్షలుగా ఉంటుంది. 2 లక్షలకు రెండేళ్లలో వడ్డీ ద్వారా రూ.32,044 సంపాదించవచ్చు. పోస్టాఫీసుల్లో ఈ పథకం కోసం అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఒక మహిళ బహుళ అకౌంట్స్‌ను కూడా తెరవవచ్చు.