బెజవాడ నగరం ఖాళీ అవుతోంది. తమ ఇళ్లను ఖాళీ చేసి బాధితులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. వరద నీరు పోవడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉండడంతో తాగునీరు కూడా దొరక్కపోవడంతో బంధువుల ఇళ్లకు చేరుకుంటున్నారు. గత నాలుగు రోజులుగా వరదనీటిలోనే ప్రజలు మగ్గిపోయారు. వరద ప్రభావంతో విజయవాడలోని కొన్ని కాలనీల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.