అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే అమెరికాలోని అత్యంత రహస్య విషయాలను బట్టబయలు చేస్తానని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. ఆయన ఓ పాడ్కాస్ట్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 2024 అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే యూఎఫ్వో రహస్యాలు, మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్యకు సంబంధించిన పత్రాలు, ఎప్స్టైన్ ఫైల్స్ వంటి రహస్యాలను బహిర్గతం చేస్తానని హామీ ఇచ్చారు.