వేదిక పిల్లర్లు కూలి ఇద్దరు మృతి (వీడియో)

69చూసినవారు
పంజాబ్‌లోని లూథియానాలో ఘోర ప్రమాదం జరిగింది. జాగరణలో ఏర్పాటు చేసిన వేదిక పిల్లర్లు కూలి ఇద్దరు మృతి చెందారు. హంబ్రా రోడ్‌లోని గోవింద్ గోదామ్ సమీపంలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. నవరాత్రి సందర్భంగా అక్కడ జాగరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా గాలి వీయడం వల్ల వేదికకు సపోర్టుగా ఏర్పాటు చేసిన స్టాండింగ్ పిల్లర్లు కుప్పకూలాయి. దీంతో ఇద్దరు మహిళా భక్తులు మృతి చెందారు. ఈ ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్