తాగుడుకు బానిసైన తమ భర్తలతో ఆ వ్యసనాన్ని మాన్పించే ప్రయత్నం చేస్తున్న మహిళలకు మధ్యప్రదేశ్ మంత్రి నారాయణ్ సింగ్ కుశ్వాహా ఓ సూచన చేశారు. ‘ఇంటికే మద్యం తెచ్చుకోని తాగమనండి. ఎందుకంటే తమ భార్యాపిల్లల ముందు తాగడానికి సిగ్గుపడతారు. పైగా పిల్లలు చూస్తే వారు కూడా అదే దారిలో నడిచే ప్రమాదం ఉంటుందని వారికి గుర్తుచేయండి. ఈ పద్ధతి పని చేయొచ్చు’ అని సలహా ఇచ్చారు.