ఏపీలోని అనంతపురం జిల్లాలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. జిల్లాకేంద్రంలోని ఓ పాఠశాల పై కప్పు పెచ్చులు ఊడిపడడంతో.. ఒక విద్యార్థిని తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గమనించిన స్కూల్ సిబ్బంది గాయపడ్డ విద్యార్థినిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.