రవాణా రంగంలో మిగిలిన వాహనాల డ్రైవర్లందరితో కలిపి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని....46వ లేబర్ కమిషన్ సిఫార్సు చేసినప్పటికీ... తెలుగు రాష్ట్రాలలో నేటికీ సంక్షేమ బోర్డు ఊసే లేదు. కరోనా కాలంలోనూ, ఆ తర్వాత కిరాయిలు లేక కుటుంబ పోషణ కష్టమై తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ మరింత భారాలను మోపాయి.