అసభ్యంగా ప్రవరించిన కండక్టర్ ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని (వీడియో)

58చూసినవారు
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ బస్ కండక్టర్ కు దేహశుద్ది చేశారు. మహారాష్ట్రలోని రత్నగిరిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు ఓ బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థినులతో కండక్టర్ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో సదరు విద్యార్థులు బస్సును ఆపి కండక్టర్ ను నిలదీశారు. అనంతరం ఓ యువతి ఆవేశంతో కండక్టర్ ను చెప్పుతో కొట్టగా.. మరో యువతి అతడి చెంపలు వాయించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్