దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు నోబెల్

82చూసినవారు
దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు నోబెల్
దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు నోబెల్ బహుమతి దక్కింది. 2024 ఏడాదికి సాహిత్యంలో ఆమెకు నోబెల్ బహుమతి ప్రకటిస్తూ స్వీడిష్ అకాడమీ నిర్ణయం తీసుకుంది. హాన్ కాంగ్ 1970లో దక్షిణ కొరియాలోని గ్వాంగ్జు నగరంలో జన్మించారు. తొమ్మిదేళ్ల వయసులో ఆమె కుటుంబంతో కలిసి సియోల్‌కు వెళ్లారు. ఆమె సాహిత్య నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తండ్రి సైతం ప్రసిద్ధ నవలా రచయితగా పేరొందారు.

సంబంధిత పోస్ట్