నటి సన్నీ లియోన్ తన పెళ్లి నాటి ఫోటోను షేర్ చేసింది. డానియల్ వెబర్‌ను పెళ్లి చేసుకుని 13 ఏళ్లు గడిచిన నేపథ్యంలో ఆ నాటి ఫోటోను ఆమె తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దేవుడి ముందు ఒట్టు వేశామని, మంచి సమయాల్లోనే కాదు, కష్ట సమయాల్లోనూ కలిసి ఉండాలని ప్రామిస్ చేసినట్లు ఆ ఫోటోకు ఆమె క్యాప్షన్ కూడా ఇచ్చింది.