ప్రపంచంలోనే అతి గొప్ప మార్షల్ ఆర్టిస్టుల్లో బ్రూస్ లీ ఒకరు. ఆయన నటించిన అనేక సినిమాలు ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్స్ గానే కొనసాగుతున్నాయి. లెజెండరీ మార్షల్ ఆర్టిస్టు అయిన బ్రూస్ లీ కేవలం 32 సంవత్సరాల వయసులోనే కన్నుమూశారు. జూలై 20, 1973న అకస్మాత్తుగా మరణించారు. ఆయన మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఇంత వరకూ వాటికి పరిష్కారం లభించనేలేదు. ఆయన మరణం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.