1940 నవంబరు 27 న బ్రూస్ లీ కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ ఫ్రాన్సిస్కో అనే నగరంలో పుట్టి, హాంకాంగ్‌లో పెరిగాడు. ఇతని అసలు పేరు లీ జూన్ ఫాన్. బ్రూస్ లీ తండ్రి లీ హోయ్ చాన్.. హాంగ్‌కాంగ్‌కు చెందిన ఒక పేరు పొందిన కాంటోనీస్ ఒపెరా గాయకుడు. అయితే 1939 డిసెంబరులో లీ తల్లిదండ్రులు అంతర్జాతీయ ఒపెరా యాత్రలో భాగంగా అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలోని చైనాటౌన్ కి వెళ్ళారు.