13 ఏళ్ల కల్లా హాంకాంగ్‌లో మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం సాధించాడు. 16 ఏళ్ల వయసులో అమెరికా వెళ్లాడు. 26వ ఏట అమెరికా టీవీలో మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా కనిపించి అలరించాడు. ముఖ్యంగా జిత్ కునెడో పేరిట ఆయన సొంత ఫైటింగ్ టెక్నిక్‌ను ప్రవేశపెట్టారు. 29వ ఏట బ్రూస్ లీ హాంకాంగ్ తిరిగి వెళ్లాడు. సినీ రచయితగా, డైరెక్టర్‌గా, నటునిగా, ఫైట్‌మాస్టర్‌గా పని చేశాడు. ఎంటర్ ద డ్రాగన్ తదితర చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరాధ్యుడయ్యాడు.