సుమారు 5 వేల కిలోమీటర్ల దూరం నుంచి చైనాకు చెందిన ఓ వైద్యుడు ఓ రోగికి ఊపిరితిత్తుల కణతి తొలగింపు సర్జరీని విజయవంతంగా పూర్తిచేశారు. ఆపరేషన్ దాదాపు గంట సేపు సాగింది. టెలి మెడిసిన్, రోబోటిక్ సర్జరీలో ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు. షాంఘైలోని హౌషాన్ దవాఖానకు చెందిన ప్రముఖ సర్జన్ డాక్టర్ లీవీ, టెలికమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించి తన ఆఫీసు నుంచే రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ ద్వారా ఈ ఆపరేషన్ నిర్వహించారు.