యాదాద్రి: కంపెనీలో గ్యాస్ లీక్.. కార్మికులకు తీవ్ర అస్వస్థత

62చూసినవారు
యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం నారాయణగిరిలోనీ సాయి తేజ డ్రగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపనీలో ఆదివారం గ్యాస్ లీకైంది. మున్నాలాల్, పరమేశ్వర్, దేవశారన్ అనే ముగ్గురు కార్మికులు తీవ్ర అస్వస్థత గురయ్యారు. మున్నాలాల్కు ఊపిరి ఆడక పరిస్థితి విషమించడంతో అబ్దుల్లాపూర్ మెట్ 108 సిబ్బంది సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. మెరుగైన వైద్యం కోసం వనస్థలిపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్