చిలుకూరు కనకదుర్గమ్మ జాతరలో ఘర్షణ
చిలుకూరు మండలం కనకదుర్గమ్మ జాతరలో ఆదివారం ఘర్షణ చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మాజీ సర్పంచ్ భర్తకు ఓ ఏఆర్ కానిస్టేబుల్ కు మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో రెండు వర్గాలుగా చీలి ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో పరిస్థితిని అదుపు చేయబోయిన చిలుకూరు ఎఎస్ఐ పై దాడికి యత్నించారు. కాగా పోలీస్ ఫోర్స్ వచ్చి పరిస్థితిని అదుపు చేశారు.