Sep 13, 2024, 10:09 IST/
మజ్జిగ అన్నం తింటే ఎముకలు బలంగా తయారవుతాయి
Sep 13, 2024, 10:09 IST
పెరుగుతో అన్నం తింటే ఆరోగ్యానికి మంచిది. అయితే పెరుగు అన్నం కంటే మజ్జిగ అన్నం తినడమే ఆరోగ్యానికి మరింత మంచిదట. మజ్జిగ శరీరాన్ని చల్లబరుస్తుంది. డీహైడ్రేట్ కాకుండా చేస్తుంది. మజ్జిగ నుండి క్యాల్షియం కూడా మెండుగా లభిస్తుంది. దీని వలన దంతాలు, ఎముకలు బలంగా తయారవుతాయి. మజ్జిగలో ఉండే పొటాషియం.. రక్త పోటును నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.