కారు, బైక్ ఢీ..ఇద్దరికి గాయాలు
సూర్యాపేట: గరిడేపల్లి మండలం అప్పన్నపేట శివారులో కారు, బైకు ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. చింతలపాలెం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన షేక్ మౌలానా, దైవ భిక్షం ద్విచక్రవాహనంపై హుజూర్నగర్ వైపు వస్తుండగా హుజూర్నగర్ నుంచి గుడుగుండ్లపాలెం వెళుతున్న కారు టైరు పంచర్ అయి అదుపుతప్పి ఢీకొట్టింది. ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.