కారు ఢీ.. బెక్కం శ్రీరామ్ మృతి
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి గ్రామానికి చెందిన బెక్కం శ్రీ రామ్(11), తన అమ్మమ్మ కలిసి మంగళవారం శ్రీరామ్ తమ్ముణ్ణి స్కూల్ బస్సు ఎక్కించి వస్తుండగా హుజూర్ నగర్ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీ కొనడంతో శ్రీ రామ్ తలకు గాయం అయింది. సీరియస్ గ ఉండటంతో కోదాడ నుండి ఖమ్మం తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సై చలిగంటి నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.