గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆదివారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో గీత కార్మికులకు సేఫ్టీ మోకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సామేలు, పద్మావతి రెడ్డి, కౌండిన్య గౌడ సంఘం నాయకులు కేఎల్ఎన్ ప్రసాద్, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ప్రజాప్రథినిధులు ఉన్నారు.