ప్రజాపాలన దరఖాస్తుల సవరణకు హుజూర్ నగర్ మున్సిపాలిటీ ఎంపీడీవో కార్యాలయాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతేడాది దరఖాస్తుదారులు పట్టణం ఏ మండల పరిధిలో దరఖాస్తు చేశారో అక్కడికే వెళ్లి వివరాలు అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుందని గురువారం అధికారులు తెలిపారు. ఆధార్ కార్డు, విద్యుత్తు బిల్లులోని యూఎస్సీ నంబరును వెంటతీసుకెళ్లి అప్డేట్ చేయించుకోవాలని అన్నారు. ఆన్లైన్లో నమోదైన వారే పథకానికి అర్హులు అని చెప్పారు