కంటి వెలుగులు శిబిరాన్ని ఆకస్మికంగా సందర్శించిన డిప్యూటి డిఎమ్‌హెచ్ఓ

106చూసినవారు
కంటి వెలుగులు శిబిరాన్ని ఆకస్మికంగా సందర్శించిన డిప్యూటి డిఎమ్‌హెచ్ఓ
కంటి వెలుగులు శిబిరాన్ని డిప్యూటి డిఎమ్‌హెచ్ఓ నిరంజన్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సంధర్బంగా శిబిరంలో జరుగుతన్న వైద్య పరీక్షల వివరాలను తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేసారు. అనంతరం వైద్యాధికారి డా.శ్రీలత మాట్లాడుతు, ఈ రోజు 115 మందికి కంటి పరీక్షలు చేసామని, 73 మందికి కంప్యూటర్ పరీక్షలు, 41 మందికి కళ్ళ జోళ్ళు అందించామని, 19 మందికి ఆపరేషన్ కొరకు పంపామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ లచ్చీరామ్ నాయక్, పిహెచ్ఎన్ శోభ, సూపర్ వైజర్ రేణుక, కృష్ణమూర్తి, టీమ్ మెడికల్ ఆఫీసర్ నాజియా, విజయకుమారి, మంజుల, కిరణ కుమార్, శైలజ, ఆశ కార్యకర్తలు శ్రీలక్ష్మీ, సునిత, సైదమ్మ, గీత తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్