రక్తదానం ప్రాణదానంతో సమానం: సిఐ రాము

52చూసినవారు
రక్తదానం ప్రాణదానంతో సమానం: సిఐ రాము
ముస్లిం యువత సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కోదాడ పట్టణ సీఐ రాము అన్నారు. ఆదివారం కోదాడలో యునైటెడ్ ముస్లిం యూత్ ఆధ్వర్యంలో మిలాదున్ నబీ సంధర్బంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రక్తదానం ప్రాణదానంతో సమానం అన్నారు. కాగా 100 మంది ముస్లిం యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం యూత్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్