అనంతగిరి మండల ప్రజలకు
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు శ్రీనివాసరెడ్డి ఆదివారం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలకు వ్యవసాయానికి రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి గుర్తు సంక్రాంతి అన్నారు. ప్రజల కష్టాలు భోగి మంటలలో కలిసి పోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు త్వరలో పరిష్కారం కాబోతున్నాయని చెప్పారు.