కోదాడ పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన నాగం రవికుమార్ వదల లో చిక్కుకొని మృతి చెందడం బాధాకరమని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం అన్నారు. సోమవారం కోదాడలోని గాంధీ నగర్ లో రవికుమార్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. రవికుమార్ కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు గంధం పాండు ఉన్నారు.