కోదాడ: గడ్డి మోపులు దగ్ధం

73చూసినవారు
కోదాడ: గడ్డి మోపులు దగ్ధం
గుర్తు తెలియని వ్యక్తులు పశుగ్రాసానికి నిప్పు పెట్టడంతో 83 మోపుల పశుగ్రాసం కాలి బూడిదైన సంఘటన మోతె మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుడు అయిత బోయిన జగ్గయ్య తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వెనుక బండ పైన పశుగ్రాసాన్ని గడ్డివామి వేసి నిల్వ చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో గడ్డి పూర్తిగా కాలిపోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం వ్యక్తం చేశాడు.