టోల్ రోడ్డులో ప్రయాణిస్తున్నప్పుడు మీ వాహనం అకస్మాత్తుగా ఆగిపోతే మీ వాహనాన్ని తీసుకెళ్లడం టోల్ కంపెనీ బాధ్యత. అలాగే ఎక్స్‌ప్రెస్ హైవేలో మీ కారులో పెట్రోల్ లేదా బ్యాటరీ అయిపోతే.. మీ కారుకు పెట్రోల్ లేదా చార్జింగ్ అందించడం కూడా టోల్ సంస్థ బాధ్యతే. ఈ ప్రయోజనం పొందాలంటే 1033కి కాల్ చేయాలి. ఇక కారు పంక్చర్ అయినా, ఎవరైనా అకస్మాత్తుగా అస్వస్థతకు గురైనా 1033కు ఫోన్ చేయెచ్చు. ఇటువంటి సేవలను పొందేందుకు టోల్ రసీదును చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి.