AP: ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ కింద ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డ్రోన్ పైలట్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. టెన్త్ పూర్తయిన వారు అర్హులు. డిసెంబర్ 9లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి 3 నెలలు శిక్షణ ఇచ్చి రూ.19 వేలతో ఉద్యోగం ఇస్తారు. డిసెంబర్ 10న గుంటూరులోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఇంటర్వ్యూ ఉంటుంది. పూర్తి వివరాలకు 80746 07278, 99888 53335 నంబర్లకు కాల్ చేయండి.