ప్యారిస్‌లోని నోట్రే డామ్ కేథడ్రల్ తెరుచుకుంది. ప్రపంచ వారసత్వ కట్టడం అయిన దీని పైకప్పుపై 2019లో అగ్నిప్రమాదం జరగడంతో మూసివేశారు. ఆ తర్వాత దీన్ని పున:నిర్మాణం చేపట్టారు. 5 ఏళ్ల తర్వాత తాజాగా తెరిచారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ మాట్లాడుతూ ఐదేళ్ల తర్వాత కేథడ్రల్లో గంటలు మోగడం సంతోషంగా ఉందన్నారు. ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, మస్క్, ప్రిన్స్ విలియమ్స్ పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.