మునగాల మండలం బరాఖాత్ గూడెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం శుక్రవారం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ గా పొలిశెట్టి శ్రీనివాసరావు, ధర్మకర్తలుగా వట్టే సైదులు, కొండ గోపయ్య, ఇనుకూర్తి వీరా చారి, కొర్ర తులసి, గోవింద రామరావు, గుడిపాటి వెంకటరమణ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్య క్రమం లో ఆలయ అర్చకులు , స్ధానికులు ఉన్నారు.