పార్లమెంటు ఎన్నికలకు కోదాడ సెగ్మెంట్ పూర్తి సంసిద్ధత తో ఉన్నదని కోదాడ ఆర్డీఓ సిహెచ్ సూర్యనారాయణ అన్నారు. గురువారం ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల సామ్రాగ్రి పర్యవేక్షించి మాట్లాడారు. ఎన్నికల సిబ్బందికి ఇబ్బందిగా లేకుండా అన్ని ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల విధులు కోదాడ సెగ్మెంట్ కు కేటాయించబడిన ఉద్యోగులు 12వ తేదీ ఉదయం8 గంటల వరకుబాలాజీ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల వద్దకు హాజరు కావాలన్నారు.