మునగాల మండలం జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులను ఏఈ నరసింహుమూర్తి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పున: పరిశీలన చేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 90% ఆదర్శ పాఠశాల పనులు పూర్తి అయినవని, 10శాతం పనులు అతి త్వరలో పూర్తి కానున్నాయని తెలిపినారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ వెంపటి భీష్మ రావు, ప్రధానోపాధ్యాయులు ఎం సతీష్ కుమార్, వక్కంతల భరత్ బాబు, తదితరులు పాల్గొన్నారు.