కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గళం నరేష్ చారి కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం అంగుళ్ళం సుద్ద ముక్క పై శివలింగం , త్రిశూలం చెక్కి తన కళాత్మకతను చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువుల పై పలు కళారూపాలను ఆవిష్కరించి అవార్డులను పొందాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే సూక్ష్మ కళలో రాణించి తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తెస్తానని చారి పేర్కొన్నాడు.